calender_icon.png 22 March, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కెనరా బ్యాంక్ రీజినల్ కార్యాలయం ప్రారంభోత్సవం

22-03-2025 02:28:28 AM

ప్రారంభించిన చీఫ్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ 

నిజామాబాద్ మార్చి 21: (విజయ క్రాంతి) : నిజామాబాద్ నగరంలో కెనరా బ్యాంక్ నూతన రీజినల్ బ్యాంకు కార్యాలయాన్ని ఆ బ్యాంకు చీఫ్ మేనేజర్ బి.చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ  ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం రోజు జరిగింది. ప్రారంభోత్సవ అనంతరం కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ బి .చంద్రశేఖర్ మాట్లాడుతూ నిజామాబాద్ రీజినల్ ఆఫీస్ యొక్క ప్రాముఖ్యత గురించి  వివరించారు. నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ నిర్మల్ మెదక్ సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 63 కెనరా బ్యాంక్ శాఖలు నిజామాబాద్ రీజనల్ కార్యాలయం పరిధిలోకి వస్తాయని  చంద్రశేఖర్ సందర్భంగా తెలిపారు.

ఖాతాదారులకు మెరుగైన ఆధునిక సేవలను అందించడానికి కెనరా బ్యాంకు తగిన చర్యలు వేగంగా చేపడుతుందని ఖాతాదారులకు త్వరితగతిన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. సిఎస్‌ఆర్ యాక్టివిటీ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ నగరంలో కదా గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లలో యువతకు పురస్కారంగా క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఓ ఏజీఎం బి శ్రీనివాస్, డీఎం ప్రవీణ్ సిబ్బంది పాల్గొన్నారు.