మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరీ కాలని హనుమాన్ దేవాలయంలో శనివారం గోపాస్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ ఆధవర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోమాతను అలంకరించి గోపూజ నిర్వహించారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి వేముల రమేష్ మాట్లాడుతూ.. గోవు విశిష్టత, ప్రాధాన్యత, గో ఉత్పత్తుల వినియోగం గూర్చి వివరించారు. గో సంపద పెంచుకోవాలని, గోవును రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. గోవును జాతీయ ప్రాణి గా ప్రకటించాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు గొత్తిపతి కనకతార, నగర కార్యదర్శి కొండపర్తి సంజీవ్, కార్యకర్తలు ముత్యం పద్మ, రాంచందర్, చారి, సంజయ్, తదితరులు పాల్గొన్నారు.