14-04-2025 12:01:21 AM
- హాజరైన ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు
ఎల్బీనగర్, ఏప్రిల్ 13 : నాగోల్ డివిజన్ జైపురి కాలనీ - నువ్వుల బండలో ఆదివారం బంగారు మైసమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు టీ పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, స్వప్న దంపతులు హాజరై, అమ్మవారికి వొడి బియ్యం, చీరెలు, గాజులు అందజేశారు.
ఈ సందర్భగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. బంగారు మైసమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తునన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు చంద్ర కళ, సురేశ్, మహే శ్ తదితరులు పాల్గొన్నారు.