22-02-2025 12:11:03 AM
శంషాబాద్ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్
పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి): శంషాబాద్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్‌లో వివిధ రకాల రుచులు మైమరిపింపజేశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ రకాల ఆధునిక, సాంప్రదాయ వంట కాలను తయారు చేసి ప్రదర్శించారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ.. విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేం దుకు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిం చాలని సూచించారు.
నేటి యువత జంక్ ఫుడ్‌కి అలవాటుపడి పోషకాలు ఉన్న సాంప్రదాయ వంటకాలను మర్చిపోతున్న తరుణంలో ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిం చడం అభినందనీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సుష్మ మహేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రేఖ గణేష్ గుప్తా, మాజీ ఏఎంసీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, కాలేజ్ ప్రిన్సిపల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.