18-02-2025 12:00:00 AM
చేవెళ్ల , ఫిబ్రవరి 17 : చేవెళ్ల మండల పరిధి కౌకుంట్ల గ్రామంలో శ్రీ నాభిశిల, ధ్వజస్తంభ, పోతురాజు పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు గత రెండు రోజుల నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం మహోత్సవాల్లో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కార్తీక్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా హనుమాన్ ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.