calender_icon.png 4 March, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మోడల్ స్కూల్ ఫేర్‌వెల్ వేడుకలు

03-03-2025 12:00:00 AM

మంచిర్యాల, మార్చి 2 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో గల తెలంగాణ మోడల్ స్కూల్ లో నిర్వహించిన ఫేర్ డే వేడుకలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా బిగ్ బాస్ షో సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ విచ్చేసి విద్యార్థులను ఉత్తేజ పరిచే ప్రసంగం చేశారు. జానపద కళాకారులు గడ్డం రమేష్, ‘ఉడుకుడుకు రొట్టెలు ఫేం’ సౌజన్య పాడిన పాటలు, నృత్యాలు అందరిని అలరించాయి. పాఠశాల ప్రిన్సిపల్ ముత్యం బుచ్చన్న విధ్యార్థులకు భవిష్యత్తు ప్రణాళిక గురించి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులు నృత్యాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విధ్యార్థులు పాల్గొన్నారు.