calender_icon.png 4 March, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎలక్ట్రిషియన్ దినోత్సవ వేడుకలు

27-01-2025 04:45:34 PM

మందమర్రి (విజయక్రాంతి): ఎలక్ట్రిషియన్ దినోత్సవాన్ని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో థామస్ అల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ... ప్రపంచం విద్యుత్ దీపకాంతులతో వర్ధిల్లుతూ పగలు రేయి అనీ తేడా లేకుండా అన్ని పనులనూ విద్యుత్ వెలుగుల మధ్య సులువుగా చేసుకునేందుకు కారణం థామస్ ఆల్వా ఎడిసన్ విశేష కృషి అన్నారు. థామస్ ఆల్వా ఎడిషన్ బల్బుని కనిపెట్టిన జనవరి 27న ఎలక్ట్రిషన్ దినోత్సవంగా పరిగణిస్తూ ఎలక్ట్రిషన్లు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎలక్ట్రిషన్లు, ప్లంబర్లు పాల్గొన్నారు.