భారీగా తరలి వచ్చిన భక్తులు...
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనం ప్రజలు క్యూ లైన్ లో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆదిక సంఖ్యలో ఆలయానికి తరలిరాగా భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఉత్తర ద్వార దర్శనానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దంపతులు, ఏరియా సింగరేణి జిఎం దేవేందర్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించగా పూజా కార్యక్రమాలలో అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవిలు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుండే ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులను ఉత్తర ద్వారం గుండా స్వామి వారి దర్శనం కల్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి వారి దర్శనంకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి క్యూ లైన్ ద్వారా దర్శనానికి రాగా క్యూ లైన్ లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎఎస్ అండ్ పిసి సిబ్బంది, పోలీసులు, ఆలయ వాలంటీర్లు, సేవా సభ్యులు సమన్వయంతో తమ సేవలను వినియోగించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం సాఫీగా సాగేందుకు నిరంతరం కృషి చేశారు. ఈ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ శశిధర్ రెడ్డి నేతృత్వంలో ఎస్ఐ రాజశేఖర్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో రామగుండం సిపి శ్రీనివాసం పాల్గొని ప్రత్యేక పూజలు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన సిపిని ఆలయ పూజారులు కృష్ణ కాంతాచార్యులు ఘన స్వాగతం పలికారు. బ్రహ్మంగారి ఆలయంతో పాటు పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు అనంత చారి నరసింహచార్యులు మాట్లాడుతూ... వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం లభిస్తుందని ఆన్నారు.