భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సాంస్కృతక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.