calender_icon.png 8 February, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు..

08-02-2025 08:27:06 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మూడు రోజులు పాటు విజయవంతంగా జరిగిన స్పోర్ట్స్ మీట్లో గెలిచిన విజేతలను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ మూడు రోజుల పాటు జరిగిన జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2025 ముగింపు వేడుకలు జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.జిల్లా పోలీస్ శాఖలోని అన్ని విభాగాలలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ 100 మీటర్స్ పరుగు పందెం ఫైనల్, టగ్ ఆఫ్ వార్ ఫైనల్ మ్యాచ్ లను తిలకించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంగా క్రీడా పోటీలలో పాల్గొని తమ ఆసక్తిని చూపినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఉత్కంఠ భరితంగా సాగిన కొన్ని క్రీడా పోటీలను చూసి సిబ్బందిలోని పోరాట పటిమను గమనించానని తెలిపారు. వయసుతో కూడా సంబంధం లేకుండా కొంతమంది అధికారులు, సిబ్బంది చాలా ఉత్సాహంగా పాల్గొనడం సంతోషదాయకంగా ఉందని తెలిపారు.

ఈ స్పోర్ట్స్ మీట్లో విభాగాల వారీగా జరిగిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలియజేసి వారికి మెడల్స్ ను అందజేశారు.పోటీ ప్రపంచంలో గెలుపోటములు సహజమని, క్రీడలలోనే కాదు జీవితంలో కూడా ఎదురయ్యే ఒడిదుడుకులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. స్పోర్ట్స్ మీట్ ను అద్భుతంగా ఏర్పాటు చేసిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సబ్ డివిజన్ల వారీగా క్రీడాకారులు స్పోర్ట్స్ మీట్ ముగింపు పేరెడ్ తో ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ విజ్ఞప్తి మేరకు జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ యాన్యూవల్ స్పోర్ట్స్ మీట్ 2025 ను ముగిస్తున్నట్లుగా ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బంది తమ అనందత్సవాలను వ్యక్తపరిచారు.