calender_icon.png 27 December, 2024 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

08-11-2024 04:34:06 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని స్థానిక ఐబి ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లె నాగభూషణం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలందరిని నిర్వీర్యం చేశారని అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్, అన్నం చిన్నయ్య, కౌన్సిలర్ వెంకటేష్, చిన్న రమేష్, వెంకటస్వామి గౌడ్, అంకతి శ్రీనివాస్, లచ్చన్న, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.