calender_icon.png 12 February, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దమ్మ గుడిలో వైభవంగా చండీ హోమం

12-02-2025 06:46:59 PM

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవపురం జగన్నాధపురం గ్రామాల మధ్య వెలిసిన కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మ గుడిలో పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం దేవస్థాన ఆవరణలోని యాగశాలలో చండీ హోమం నిర్వహించారు. ముందుగా మేల తాళాలతో, వేదమంత్రాలతో అమ్మవారి ఉత్సవ విగ్రహములను దేవాలయం నుండి యాగశాలకు అర్చకులు తరలించారు. అనంతరం మండపారాధన, గణపతి పూజలు, చండీ హోమం, పూర్ణ హారతి కార్యక్రమం నిర్వహించారు. హోమంలో 15 మంది దంపతులు ఒక్కొక్కరు రూ.2516/- రుసుము చెల్లించి చండీ హోమంలో పాల్గొన్నారు. శేష వస్త్ర ప్రసాదం అమ్మవారి ప్రసాదం, భక్తులకు అన్నదాన వితరణ జరిపించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.