calender_icon.png 2 April, 2025 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

01-04-2025 12:39:42 AM

సంగారెడ్డి, మార్చి 31 (విజయ క్రాంతి): రంజాన్ పండగ సామూహిక ప్రార్థనలు ఈద్గా మైదానాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేకంగా చేశారు. సోమవారం సంగారెడ్డి పట్టణంతోపాటు జిల్లాలోని పటాన్ చెరు, జహీరాబాద్, సదాశివపేట్, ఆందోల్, నారాయణఖేడ్ పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాలలో ఉన్న ఈద్గా మైదానాల్లో ముస్లిం లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గత నెల రోజులుగా ఉపవాస దీక్షలో ఉండి రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం సోదరులకు పలువురు రాజకీయ నాయకులు, అధి కారులు, పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా మైదానాల్లో ప్రార్థనలు చేసేందుకు భారీ సంఖ్యలో ముస్లింలు రావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో రంజాన్ పండుగ ప్రశాంతంగా ముగిసింది. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్  సంగారెడ్డి పట్టణంలోని ఈద్గా మైదానాలకు వెళ్లి ప్రార్థనల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు.