24-02-2025 05:33:42 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం సులానగర్ గ్రామంలో గల అద్భుతాల మేరీ మాత మందిర మూడవ వార్షికోత్సవం వేడుకలను ఆర్సీఎం చర్చి ఫాదర్ మార్నేని ఆర్లయ్య ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఖమ్మం పిఠాధిపతులు బిషప్ సాగిలి ప్రకాష్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆర్సిఎం చర్చిలో చిన్నారులు కోలాటం, నృత్యాలతో అందర్నీ ఆకట్టుకున్నాయి.
అనంతరం బిషప్ ఖమ్మం పీఠాధిపతులు సాగిలి ప్రకాష్ ను ఆర్సిఎం సంఘం చర్చి సభ్యులు శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఫాదర్లు తుంపాటి అగస్టీన్, జయరాజు, జయనందు, అమృత్, తుడుం యాకోబు, విజయ్, మహిళలు, సంఘ పెద్దలు, ఉపదేశులు, యువతి యువకులు, కోయగూడెం, మాలపల్లి, సులానగర్ గ్రామాల నుంచి క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.