calender_icon.png 20 February, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2025 06:44:57 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ మండల చేగుంట పట్టణ కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో టిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలు గ్రామాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. అనంతరం చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ హయంలో తెలంగాణ సస్యశ్యామలంగా ఉండేదని, అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి అందరి మన్ననలను పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ లా ఫోరమ్ అధ్యక్షులు మంచి కట్ల శ్రీనివాస్, అన్నం రవి, లక్ష్మణ్ బక్క దశరథం, కౌడి స్వామి, డాక్టర్ రమేష్, వడ్డేపల్లి నర్సింలు, మీరు గయాసుద్దీన్, అలీ, యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు.