calender_icon.png 26 December, 2024 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

08-11-2024 03:43:02 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ ల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రి వద్ద రోగుల సౌకర్యార్థం నూతనంగా బస్ స్టాప్ ను ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ లు ప్రారంభించారు. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం.సూరిబాబు, ప్రచార కమిటీ కన్వీనర్ నాతరిస్వామిల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులు వేడుకలు జరుపుకున్నారు. వేములపల్లి మండలంలో రుద్రపట్ల సంతోష్ కుమార్, కాసిపేట 1 గనిపై నాయకులు బన్నా లక్ష్మణ్ దాస్, కన్నెపల్లిలో నాయకులు మాధవరపు నర్సింగరావుల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు.