calender_icon.png 15 November, 2024 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

15-11-2024 01:30:50 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా తెలుగు విశ్వవిద్యాలయంలో వేడుక లను ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య అలే ఖ్య పుంజాల హాజరై, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే ప్రసంగం చేశారు.

తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన లోకకవి అందెశ్రీ గౌరవ అతిథిగా హాజరై భారత తొలి ప్రధాని పం డిత్ జవహర్‌లాల్ నెహ్రూకు పిల్లలంటే అమితమైన ఇష్టమని చెప్పారు. విద్యార్థులు భవిష్యత్తులో పెద్దయ్యాక ఏ వృత్తి చేపట్టినా అందులో రాణించాలని అన్నారు. సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పూర్ణచంద్ర ప్రదర్శించిన మ్యాజిక్ షో పిల్లలందరినీ అలరించింది.

పిల్లలకు ఏకపాత్రా భినయం, పాటలు, నృత్యం, బాలల కథానిక, కవిత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహించి, గెలుపొందినవారికి నగదు బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు అందజేశారు. 

విద్యార్థులకు సామాజిక విలువలు నేర్పించాలి

కాప్రా, నవంబర్‌౧౪: విద్యార్థులకు సామాజిక విలువలు నేర్పించడంతోపాటు అన్ని రంగాల్లో నిష్ణాతులను చేపేందుకు భాష్యం విద్యాసంస్థలు కృషిచేస్తున్నాయని జడ్‌ఈవో మార్కండేయులు అన్నారు. డాక్టర్ ఏఎస్‌రావు నగర్‌లోని భాష్యం విద్యాసంస్థల్లో గురువారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అమరేశ్వర్‌రావు పాల్గొన్నారు.