మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని బి1 కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నూర్ మాజి ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజి ప్రధాన కార్యదర్శి సొట్కు సుదర్షన్ లు కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెడ్పిటిసి నుంచి మొదలై ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రిగా ఎదిగారని అన్నారు. పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ఓయాణించిందని వారు గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు తుంగలో తొక్కిందని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులకు గురవు తున్నారని దళిత గిరిజన దండోరా సభతో ప్రజల్లోకి వెళ్లి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ సూచనల మేరకు 6 గ్యారెంటీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అందులో ఐదు పథకాలు అమలు ఆవుతున్నాయని మరో గ్యారంటీ అతి త్వరలోనే అమలు జరుగుతుందని వారు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నెరువట్ల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు గడ్డం రజిని, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లూరు లక్ష్మణ్, సీనియర్ నాయకులు గుడ్ల రమేష్, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి జమీల్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కనకం రాజు, సేవాదల్ జిల్లా అధ్యక్షులు ఎండి ఆఫీస్, సునీల్ కుమార్, మంకు రమేష్, అంకం రాజ్ కుమార్, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.