01-03-2025 07:30:28 PM
కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ శనివారం సపల కంపెనీ సీఎండి, ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టరేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జన్మదిన సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుధాకర్ గౌడ్ కేక్ కట్ చేసిన అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... సౌత్ క్యాంపస్ కి ఎల్లా రెడ్డి పెద్దదిక్కుగా మారారని క్యాంపస్కు వాటర్ ప్లాంట్ కరెక్ట్ వేదిక, నెక్ న్యాక్ గుర్తింపు, పట్టు పరిశ్రమ నుంచి సౌత్ క్యాంపస్ భూ బదలాయింపు తదితర ఎన్నో కార్యక్రమాలతో పాటు ఆడిటోరియం భవన నిర్మాణానికి హామీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
అనంతరం డాక్టర్ సంతోష్ కూడా మాట్లాడుతూ... కేవలం సౌత్ క్యాంపస్ కె కాకుండా జిల్లావ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ముందున్నారని రాష్ట్రంలో అనేక వాటర్ ప్లాంట్లు గుడులు బడులకు జీవితం అందించడానికి కార్యక్రమాలు చేపడుతున్నారని ఎంతోమంది గ్రామీణ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు విదేశాలలో విద్యను అందించడానికి తన ప్రోత్సాహం చాలా మంది విద్యార్థులకు అందిందని తెలిపారు. సేవా తత్పరుడైన డాక్టర్ పైడి ఎలా రెడ్డికి హాయ్ ఆరోగ్యాలు ప్రసాదించాలని దేవుడిని విద్యార్థులు అధ్యాపకులు స్కాలర్సు ప్రార్థించారు.