కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎమ్మెల్యే కోవలక్ష్మి నివాసంలో గురువారం రాత్రి చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ కన్నుల పండుగగా నిర్వహించారు. ఎమ్మెల్యే కుమారుడు కోవా సాయినాథ్ దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా కోవా లక్ష్మీ దంపతులు పాల్గొన్నారు. స్వామివారి పడిపూజలో కళాకారుల భక్తి గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుండి అయ్యప్ప దీక్షాపరులు హాజరయ్యారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు పూజాలో పాల్గొన్నారు.