మానకొండూర్, జనవరి09: ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు ఆలయ ప్రాంగణాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీ వెంకటేశ్వర కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ గురువారం తెలిపారు. సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముక్కోటి ఏకాదశికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టి ఏర్పాటు చేస్తామని అన్నారు.
కరీంనగర్ పట్టణానికి అతి సమీపంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కథ కొన్ని ఏళ్ల క్రితం నిర్మాణం చేపట్టిందని ఈ ఆలయంలో దర్శనం చేసుకోవడంతో కోరిన కోరికలు తీర్చే వెంకన్నను దర్శనం చేసుకుని పునీతులు కావాలని కోరారు. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసి రంగురంగు పూలతో స్వామివారిని అలంకరించారు.
ఉదయం 4. గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తామని ఎల్‌ఎండిలో ప్రశాంతమైన వాతావరణంలో పార్కింగ్ సౌకర్యం కూడా అనువుగా ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రదాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, సభ్యులు పోలు కిషన్, ఒంటెల రవీందర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, వేంకటేశ్వర రావు, రామచంద్ర రెడ్డి, ప్రసాద్ రెడ్డి, కిరణ్, గంగారపు రమేష్, ధన లక్మీ,కరుణ, కరుణాకర్, వెంకట్ రెడ్డి, పుప్పాల అశోక్ రెడ్డి, బుర్ర రాజయ్య పాల్గొన్నారు.