calender_icon.png 22 April, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంపటి పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

22-04-2025 04:23:33 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటిలో మంగళవారం నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనర్సమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు మంచి మంచి దేశభక్తి పాటలకు, జానపద పాటలకు, డాన్సులు వేశారు రాణి రుద్రమదేవి, ఝాన్సీలక్ష్మీబాయి వంటి చారిత్రక పాత్రలను ఏకపాత్రాభినయం ద్వారా పోషించి ఆలోచింపజేశారు అలాగే సోది చెబుతాం, మాయల మాంత్రికుడు, ప్లాస్టిక్ భూతం, చాకలి ఐలమ్మ వంటి.. నాటికలను అద్భుతంగా ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు, అలరించారు.

అనంతరం ప్రధానోపాధ్యాయురాలు వెంకట్రామ్నర్సమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో, ఉచిత దుస్తులు ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామని, నాణ్యమైన విద్య అందుతుందని, దానికోసం ప్రత్యేక కృషి చేస్తున్నామని, ఉన్నత అర్హతలు గల ఉపాధ్యాయులు పాఠశాలలో బోధిస్తున్నారని, వివిధ రకాల ప్రవేశ పరీక్షలకు తరగతుల వారిగా తర్ఫీదునిస్తున్నామని, ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో క్రీడా పాఠశాల, గురుకుల, సైనిక పాఠశాల, ఆదర్శ పాఠశాలలో సీట్లు సాధిస్తున్నామని అన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని, క్రమశిక్షణతో రాణించిపాఠశాల పేరు ప్రఖ్యాతలను.. రాష్ట్రస్థాయిలో ఇనుమడింప చేయాలని, విద్య, క్రీడలు, ఇతర రంగాలలో రాణిస్తేనే గుర్తింపు లభిస్తుందని, పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకున్న పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలను, షీల్డ్ లను అందజేశారు. పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మల్లెపాక రవీందర్ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన నాటికలకు, పాటలకు కొరియోగ్రఫీ చేసినందుకు గాను ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి వారికృషిని కొనియాడారు, ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో ఉపాధ్యాయుడు మల్లెపాక రవీందర్ వేసిన తూర్పు కొండల సూర్యుడు.. అనే జానపద నృత్యం ఎంతగానో ఆకర్షించింది, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ఆర్థికంగా సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాలకుర్తి ఎల్లయ్య, మల్లెపాక రవీందర్, గట్టు మాధవి, బండారు భవాని, నిమ్మనబోయిన నవీన, జీడి అనిల్ కుమార్, మిట్ట గడుపుల విక్రం, మాలోతు కృష్ణ, గుండ్ల ఆంజనేయులు, వాలంటీర్లు శీలోజు రమాదేవి అబ్బగాని మంజులలు పాల్గొన్నారు.