calender_icon.png 3 February, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

27-01-2025 12:00:00 AM

 హుజురాబాద్, నవరి26 :  కరీంనగర్ జిల్లాహుజూరాబాద్ పట్టణంలోని అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ చర్చ్ స్థాపించి 11 వసంతాలు పూర్తిచేసుకుని 12వ వసంతంలోకి అడుగుతున్న సందర్భంగాచ చర్చి ఫౌండర్ చైర్మన్ నాగిశెట్టి డానియెల్ డోర్కా రాణి ఆధ్వర్యంలో ఆదివారంవార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

ఈ కార్యక్రమంలో భాగంగా పాస్టర్ నాగేశెట్టి డానియెల్ మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణ ప్రాంతంలో సేవ ప్రారంభించి 18 సంవత్సరములు గడిచినను చర్చి నిర్మించుకొని 11 సంవత్సరములు గడిచాయని ఆయన తెలిపారు ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు హుజురాబాద్ పట్టణ ప్రజలతో తమకు తమ సంఘానికి ఎల్లప్పుడూ ఉంటాయని క్రీస్తు యేసు దయ కాపుదల తమకు తమ సంఘానికి ఎల్లవేళలా తోడుగా ఉంటుందని ఆయన అభివర్ణించారు.