హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): గగన్‌పహాడ్ ఉమ్దా నగర్లో ఉన్న దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోశాల.. ‘సత్యం శివం సుందరం గౌ నివాస్’లో ఆదివారం మహా అన్నకూట్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిశ్చంద్రజీ కులకర్ణి మహాలక్ష్మిపంచకుండియ మహాయజ్ఞం నిర్వహించారు. అనిరుధ్జీ మధురమైన భజనలు ఆలపిం చారు. వేలాది మంది జంతు, ఆవు ప్రేమికులు భక్తులు పాల్గొన్నారు. కాగా ఈ గోషాలను 84 ఏళ్ల క్రితం ధరమ్‌రాజ్ రాంఖా స్థాపించారరు. ఇప్పటివరకు 6 వేల ఆవులు, దూడలు, ఎద్దులను కబేలాల నుంచి రక్షించారు.