రామాయంపేట (విజయక్రాంతి): మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ 12 వార్డులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభలు ఈనెల 21 నుండి 23 వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలపై ఎంపిక ప్రక్రియలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు. ఈ గ్రామ సభలకు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించి విజయవంతం చేయాలని అయన సూచించారు.