calender_icon.png 24 January, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో గ్రామసభలు

24-01-2025 04:22:10 PM

పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం...

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్, కాళీమాత టెంపుల్, భగత్ సింగ్ నగర్ ఏరియాలలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలకు ముఖ్యఅతిథిగా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామసభలలో ప్రభుత్వ అధికారులకు ప్రజలు సహకరించాలని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును అందిస్తామని తెలిపారు. తొలి విడత జాబితాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానీ వాళ్లు అధైర్యపడవద్దని, ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు పంపిణీ నిరంతరంగ జరిగే ప్రక్రియ అన్నారు. అనంతరం స్థానిక మహిళలు ఎమ్మెల్యే పాయంను శాలువతో సత్కరించారు. కార్యక్రమమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి గౌడ్, ప్రభుత్వ అధికారులు, మణుగూరు కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు శివ సైదులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.