calender_icon.png 23 January, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సభలు ఎవర్ని మోసం చేయడానికి..??

23-01-2025 06:23:02 PM

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు ఎవర్ని మోసం చేయడానికనీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు..?? గురువారం పార్టీ కార్యక్రమంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా నేటికీ హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. మరల ఇప్పుడు గ్రామ సభలంటూ కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. ప్రభుత్వానికి.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే ఉద్దేశం లేదని అర్దం అవుతుంది అన్నారు.

గతంలో ప్రజాపాలన ధరఖాస్తుల స్వీకరణ అంటూ, ఇంటింటి సర్వే అంటూ కొన్ని రోజులు హడావుడి చేశారని చాలా ప్రాంతాల్లో ప్రజా పాలన దరఖాస్తులు పోయిన దాఖలు ఉన్నాయన్నారు. గ్రామ సభలో రాజకీయ నాయకుల హడావుడి తప్ప ప్రజలకు లబ్ది జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో లేదని పేర్కొన్నారు. లబ్దిదారుల ఎంపికలో అవినీతి, అక్రమాలకు చోటు లేకుండా ఉండాలంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వే వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, తాటిపాముల హరికృష్ణ, పూనెం మురళి, తనుష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.