calender_icon.png 22 January, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందు, టేకులపల్లిలో ప్రారంభమైన గ్రామసభలు

21-01-2025 05:05:45 PM

ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఏకపక్షమని బీఆర్ఎస్ నాయకుల విమర్శలు...

ఇల్లెందు (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు ఇల్లందు, టేకులపల్లి మండలాలతో పాటు ఇల్లందు మున్సిపాలిటీలో మంగళవారం ప్రారంభమయ్యాయి. మండలాల్లో ఎంఈడీఓ, తహశీల్ధార్, ఎంపీఓ, ఎంఏఓ లతో నాలుగు టీములు ఏర్పాటు చేశారు. ఇల్లందు 29 పంచాయతీలు, టేకులపల్లిలో 36 పంచాయితీలు ఉండగా, మున్సిపాలిటీలో 24 వార్డుల్లో గ్రామ సభలు నిర్వహితున్నారు. టేకులపల్లి మండలంలో 21న ఎంపీడీఓ టీమ్ ముత్యాలంపాడు క్రాస్ రోడ్, రాంపురం, చుకాలబోడు, తహశీల్ధార్ టీమ్ రాళ్ళపాడు, పెత్రంచెలక, ఎంపీఓ టీమ్ కుంటాల, ఎర్రాయిగూడెం, ఎంఏఓ టీమ్ మొక్కంపాడు, బర్లగూడెం పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. కొన్ని చోట్ల లబ్ధిదారుల ఎంపికలు ఏకపక్షంగా చేస్తున్నారని ఆరోపించగా అధికారులు దానిని ఖండిస్తున్నారు. అవసరమైతే మరోమారు విచారణ చేస్తామంటున్నారు. టేకులపల్లి మండలంలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీడీఓ రవీందర్ రావు, తహశీల్ధార్ నాగభవాని, ఎంపీఓ గాంధీ, ఎంఏఓ అన్నపూర్ణాలతో పాటు, జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు.