నిర్మల్ (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 26 నుంచి అమలు చేయనున్న ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో గ్రామసభల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చిన దరఖాస్తులను సర్వే చేసిన అధికారులు ఈనెల 21 నుంచి 24 వరకు అన్ని గ్రామపంచాయతీలో గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పెట్టుబడి సాయం ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు అత్యంత నిరుపేదలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ పైజాన్ అహ్మద్, పిపిఓ శ్రీనివాస్, డిఎస్ఓ కిరణ్ కుమార్, డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, వ్యవసాయశాఖ అధికారి అంజి ప్రసాద్ తదితరులు ఉన్నారు.