28-03-2025 01:45:43 AM
భీమదేవరపల్లి మార్చి 27 (విజయ క్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోని కాలువల తవ్వకం కోసం భూమిని సేకరించేందుకు గ్రామ సభలు నిర్వహించారు. గురువారం భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్, ముల్కనూర్, వంగర గ్రామపంచాయతీ కార్యాలయాలలో గ్రామసభలు నిర్వహించడం జరిగింది .
ఈ సందర్భంగా గౌరవెల్లి ప్రాజెక్టు నుండి వస్తున్న నీటికి కాలువల నిర్మాణం కొరకు భూమిని కోల్పోయిన రైతులు వారి పేర్లను హనుమకొండ ఆర్డీవో రమేష్ రాథోడ్ చదివి వినిపించారు. భూములు కోల్పోయిన రైతులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే భీమదేవరపల్లి తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ కు తెలియజేయాలన్నారు.
గ్రామసభలలో భీమదేవరపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్. వీరేశం, డి ఈ లావణ్య పంచాయతీ కార్యదర్శులు జంగం పూర్ణచందర్, గుడికందుల మధు, వినయ్ రైతులు పాల్గొన్నారు.