calender_icon.png 30 January, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులకు న్యాయం చేయడానికే గ్రామసభలు

22-01-2025 01:03:39 AM

  • సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ
  • ప్రజలు ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురి కావద్దు
  • మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జనవరి 21 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 26న అమలు చేయనున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం మెదక్ పట్టణంలో మున్సిపాలిటీ వార్డు సభలు, శివ్వాయిపల్లి హవేలీ ఘన్పూర్ మండలం ఔరంగాబాద్ తాండ ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు 16వ తేది నుండి 20వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు 21వ తేదీ నుండి 24వ తేది వరకు గ్రామ పంచాయతి, మున్సిపల్ వార్డులల్లో  గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నాలుగు  పథకాలకు  అర్హులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామ సభలో ప్రజల సమక్షంలో చదవడం జరిగిందని ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో  గ్రామసభ జాబితాకు ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు. పథకాలు నిరంతర ప్రక్రియని అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 

గ్రామసభ ప్రారంభానికి ముందు ప్రభుత్వ సందేశాన్ని ఎంపిడిఓ చదివి వినిపించారు. ఈ గ్రామసభలో మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రపాల్,  మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు భద్రతా నియమాలు పాటించాలి

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో రవాణా శాఖ ఆద్వర్యంలో రూపొందించిన  జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం  రహదారి సురక్ష అభియాన్ శ్రద్ధ 2025 గోడ  పత్రికను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ నుండి 31 వరకు నెల రోజుల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు  జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం నిర్వహిస్తు న్నట్లు తెలిపారు.

కాగా బుధవారం  ఉద యం 10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణం నుండి రాందాస్ చౌరస్తా వరకు  9వ తరగతి నుండి డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.

ఈ భద్రతా వారోత్సవాలల్లో భాగంగా వాహన డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగస్వాము లుగా మారాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్. వెంకటస్వామి, విజయలక్ష్మి, శ్రీలేఖ, విజయలక్ష్మి, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.