calender_icon.png 23 January, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయం చేసేందుకే గ్రామసభలు

23-01-2025 12:26:00 AM

  1. అర్హుల జాబితాలో పేర్లు లేకుంటే దరఖాస్తు చేసుకోవాలి 
  2. ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రతిపక్షాల కుట్ర
  3. వాటిని ప్రజలు నమ్మవద్దు
  4. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

ఖమ్మం, జనవరి 22 (విజయక్రాంతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతోనే గ్రామసభలు నిర్వహిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు గ్రామ  లను రాజకీయం చేస్తూ, ప్రజలను భయాందోళనకు గురిచేసి, దృష్టి మరల్చేందుకు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు.

ప్రతిపక్షాల మాటలను ప్రజలు నమ్మవద్దని సూ చించారు. బుధవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి మండలం మోటాపురం, కోరట్లగూడెం, కొం గర, కోనాయిగూడెం, బుద్దారం గ్రామాల్లో ఆయన పర్యటించారు. సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ..

అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామ ని చెప్పారు. అందుకోసమే గ్రామసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలో పేరులేని అ ర్హులు గ్రామసభల్లోనే తిరిగి దరఖాస్తులను అధికారులకు అందజేయాలని చెప్పారు. రే షన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు. 

ఇల్లెందు అభివృద్ధికి కృషి

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం చేశారు. ఇల్లెందు మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఇల్లెందు అభివృద్ధికి కృషి చేస్తానని, అందుకు ప్రభుత్వం కూడా కట్టుబడి ఉన్నదని చెప్పారు.

కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కనకయ్య, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఇరిగేషన్ శాఖ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ సయ్యద్ జానీపాషా, కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీవో రాహూల్, ఎస్పీ రోహిత్‌రాజ్, డీఎఫ్‌వో కృష్ణగౌడ్ పాల్గొన్నారు.

చెల్లెమ్మలు.. నమస్కారం 

“ చెల్లెమ్మలూ.. మీ శీనన్న నమస్కారం. మీ గ్రామసభ అయిందా? జాబితాలో మీ పేరు వచ్చిందా? రాకపోతే అధైర్యపడొద్దు. నేనున్నా.. మళ్లీ దరఖాస్తు పెట్టండి మంజూరు చేస్తా. నేను పుట్టి పెరిగింది నారాయణపురమే” అంటూ  మంత్రి పొంగులేటి మహిళా కూలీలను పలకరించారు.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పర్యటనలో భాగంగా కొంగర సమీపంలోని పొలాల వద్ద  పనిచేస్తున్న మహిళలను చూసి, కాన్వా య్ ఆపి ఆప్యాయంగా పలకరించారు. అక్కా.. చెల్లమ్మలందరూ  గాజులు వే యించుకోండని చెబుతూ తన జేబు లోంచి రూ.10 వేలు తీసి ఇచ్చారు.