calender_icon.png 22 January, 2025 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామసభలు రసాభాస

22-01-2025 01:48:46 AM

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించారు. ఈ సభలు ఈ నెల 24 వరకు కొనసాగనున్నాయి. గ్రామసభల్లో అధికారులు ప్రకటించిన జాబితాలో పేర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల ప్రజలు నిలదీశారు. పొరపాట్లను సరిచేస్తామని, అర్హత ఉన్నా రాకుండా ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సర్దిచెప్పారు. గ్రామసభల వద్ద ముందస్తుగానే భారీ ఎత్తున పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

  1. ఎక్కడికక్కడ అధికారులను నిలదీసిన ప్రజలు 
  2. లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆగ్రహం

ఖమ్మం, జనవరి 21 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని బల్లేపల్లి గ్రామసభలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజలు గొడవ చేశారు. నేలకొండపల్లి, బోనకల్, చింతకాని, కొణిజర్ల, ఖమ్మం రూరల్, నగరంలోని కొన్ని వార్డుల్లో ప్రజలు ఎదురు తిరగడంతో స్వల్ప ఉద్రిక్తల మధ్య గ్రామసభలు నడిచాయి.

చింతకాని గ్రామసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు గొడవకు దిగారు. నేలకొండపల్లి మండలం మోటాపురంలోనూ ఇలాగే గొడవ చేశారు. ప్రత్యేక అధికారులతో మళ్లీ సర్వే చేసి, ఇండ్లు మంజూరు చేయిస్తామని అధికారులు చెప్పడంతో శాంతించారు.

తల్లాడ మండలం గొల్లగూడెంలో గ్రామసభను ప్రజలు అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులను ఎంపిక చేశారని, రైతు భరోసా కింద భూములున్న వారిని కూడా ఎంపిక చేశారంటూ గొడవ చేశారు. చిన్నగోపతి సభలో అన్ని అర్హతలున్నా ఎందుకు రుణమాఫీ చేయలేదని రైతులు అధికారులను నిలదీశారు. గ్రామంలో లేని వారిని ఏ విధంగా ఎంపిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేషన్‌లో కలుపొద్దు

భద్రాద్రి కొత్తగూడెం(విజయక్రాంతి): జిల్లా పరిధిలోని సుజాతనగర్ మండలం మంగపేటలో అధికారులను ప్రజలు అడ్డుకొన్నారు. గ్రామసభ ప్రారంభం కాగానే కొత్తగా ఏర్పాటు చేయనున్న కొత్తగూడెం కార్పొరేషన్‌లో తమ గ్రామాలను కలుపొద్దంటూ నినాదాలు చేస్తూ అధికారులను అడ్డుకొన్నారు. కొత్తగూడెంలోని 5వ వార్డులో జరిగిన గ్రామసభలో గందరగోళం నెలకొంది.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో పేర్లు రాని కొందరు తమ పేర్లు జాబితాలో ఎందుకు రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అర్హులందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, విచారణ చేసి అర్హులను సంక్షేమ పథకాలకు ఎంపిక చేస్తామని అధికారులు చెప్పారు. 

కాంగ్రెసోళ్లు చెప్పినోళ్లకే పథకాలు!

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి 

నాగర్‌కర్నూల్, జనవరి 21 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందుతాయని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం తెలకపల్లి మండలంలోని కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో పాటు హాజరై మాట్లాడిన వీడియో మంగళవారం సోష ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గ్రామ సభలో అధికారు లు చెప్పే లిస్టు కాకుండా కార్యకర్తలు, పెద్దలు నిర్ణ యించిన వారికే అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, డీపీవోలకు సైతం ఆదేశిం చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే చేతుల మీదుగానే లిస్టు ప్రిపేర్ అవుతుందని ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి దా మోదర్ రాజనర్సింహ కూడా చెప్పినట్లు తెలిపారు.

ఈ వ్యాఖ్యలు చేసిన వీడియోను బీఆర్‌ఎస్ నేతలు సోషల్‌మీడియాలో పోస్టు చేసి, ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి.. ఓ ప్రైవేటు కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆ వ్యాఖ్య లు చేశానని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు.

దరఖాస్తులనే చదువుతారా?

నిర్మల్(విజయక్రాంతి): జిల్లాలో నిర్వహించిన గ్రామసభల్లో అధికారులు ప్రక టించిన జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ప్రజలు తిరగబడ్డారు. దరఖా  లు మాత్రమే చదువుతారా? లబ్ధిదారుల ను ఎంపిక చేయరా అని నిలదీశారు. ఖానాపూర్ మున్సిపాలీటీల్లో కొత్త రేషన్‌కార్డుల అర్హత జాబితాల్లో ప్రభుత్వ ఉద్యోగు ల పేర్లు ఉండటంతో అధికారులను నిలదీశారు. నిర్మల్ మండటంలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జా బితాలో అర్హుల పేర్లు రాకపోవడంతో ప్ర జలు అధికారులను నిలదీశారు.

కుంటా ల మండలం ఓలా విఠాపూర్, కడెం మం డలం బెల్లాల్, సారంగపూర్ మండలంలో  సారంగపూర్, స్వర్ణ గ్రామల్లో ప్రజలు అధికారులపై మండిపడ్డారు. పట్టణంలో ని నాయుడి వాడ బంగల్ పేట్ వార్డుల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో రూ.రెండు లక్షల రుణమాఫీ చేయాలనే తమ డిమాండ్‌ను ప్రభుత్వానికి తెలిపేలా తీర్మాణాలు చేయాలని పట్టుబట్టారు. 

ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారా? 

ఆదిలాబాద్(విజయక్రాంతి): బజార్ హత్నూర్ మండల కేంద్రంలో గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిధారుల జాబితాలో తమ పేర్లు లేవని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పథకాల పేరిట, సరేల పేరిట తమను పిచ్చోళ్లను చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి ప్రజలను సముదాయించడంతో గొడవ సద్దుమనిగింది. అధికారులు స్పందించి పేరు రాని అర్హులందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.