24-04-2025 04:33:43 PM
మహాదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని ఎనుక పల్లి గ్రామంలో తాసిల్దార్ ప్రహ్లాద్(Tahsildar Prahlad) ఆధ్వర్యంలో చిన్న కాలేశ్వరం ప్రాజెక్టులో భూమి కోల్పోతున్న రైతులతో గ్రామసభ సమావేశం నిర్వహించారు. తాసిల్దార్ మాట్లాడుతూ... భూమి కోల్పోతున్న రైతుల వివరాలను, వారి యొక్క పట్టా నెంబర్లు గ్రామసభలో చదివి వినిపించారు. ఎవరైనా రైతుల వివరాలు తప్పుగా నమోదైన విస్తీర్ణంలో తప్పుగా నమోదైన తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి అని గ్రామ రైతులకు తెలిపారు. భూమి కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని గ్రామసభలో వివరించారు. గ్రామ సభలో గ్రామ ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరించారు. ఈ గ్రామసభ సమావేశంలో డిప్యూటీ తాసిల్దార్ కృష్ణ, అసిస్టెంట్ ఇఈపి. భరత్ ఆనంద్, ఇరిగేషన్ అధికారులు గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.