24-02-2025 07:25:53 PM
వీరాపూర్ చెరువు విస్తరణకు ప్రతిపాదనలు...
కాటారం (విజయక్రాంతి): చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా వీరాపూర్ చెరువు విస్తరణ కోసం జాదరావుపేట గ్రామ పంచాయతీలోని రఘుపల్లిలో గ్రామసభలో నిర్వహించారు. సోమవారం జరిగిన సమావేశంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, భూ సేకరణ అధికారి మయాంక్ సింగ్ కాటారం తహసీల్దార్ నాగరాజు సంబంధిత అధికారుల బృందం జాదరావుపేట గ్రామ పంచాయతీ (రఘుపల్లె గ్రామం)లో గ్రామ సభను నిర్వహించి వీరాపూర్ చెరువు విస్తరణ కోసం 11 గుంటల భూమి సేకరణపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక నోటిఫికేషన్ చదివి రైతులు, గ్రామ ప్రజలకు వినిపించారు. ప్రాజెక్ట్ ద్వారా ప్రభావిత రైతుల నుండి అభ్యంతరాలను స్వీకరించి, రైతుల అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కార చర్యలు తీసుకునే విధంగా సూచనలు చేశారు.