10-04-2025 12:00:00 AM
బిచ్కుంద, ఏప్రిల్ 09 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం కార్మిక సంఘం అధ్యక్షులు గోని భూమయ్య అధ్యక్షతన బిచ్కుంద జిపి కార్మికుల సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ మాట్లాడుతూ... గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు గత 30 40 సంవత్సరాల నుండి పంచాయతీని నమ్ముకుని సేవలు చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి నెలకొందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జనవరి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని హామీ నేటికి నెరవేరలేదని గత ప్రభుత్వంలో ఇప్పటి మంత్రులు స్వయంగా కనీస వేతనాలు అమలు చేస్తామని మల్టీ పర్పస్ విధానం రద్దు చేస్తామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని 34 రోజుల సమ్మె సందర్భంగా అనేక హామీలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలన్నీ అమలు చేస్తుందని కొన్ని గ్రామ పంచాయతీలలో గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లిస్తూ చెక్కలు జారీ చేయించినప్పటికీ ఎస్ టి ఓ లలో నిధులు లేక నిలిచిపోయాయి తప్ప వేతనాలు వచ్చిన పరిస్థితి లేదని గత ఆరు నెలలుగా ఆగిపోయిన వేతనాలు చెల్లించాలన్నారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 51 ద్వారా నైపుణ్యంలేని ఇతర పనులను అనారోగ్యానికి గురవుతున్నారని కార్మికులు చనిపోయిన ఇన్సూరెన్స్ సౌకర్యం లేక కార్మిక కుటుంబాలు వీధిన పడే పరిస్థితి అక్కడక్కడ వస్తుందని ఆయన అన్నారు.
గ్రామపంచాయతీలలో దాదాపు 90 శాతం దళితులని వివక్షత తో మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయకుండా ప్రభుత్వం దాటవేత్త ధరణి అవలంబిస్తుందని 51 జీవో సవరించాలని మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలని పర్మనెంట్ చేసి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభు త్వానికి సురేష్ గొండ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.