calender_icon.png 15 March, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిపి కార్యదర్శి సంతకం ఫోర్జరీ

14-03-2025 10:11:32 PM

ఇద్దరిపై కేసు నమోదు

ఎస్ఐ స్రవంతి

కామారెడ్డి,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు దోమకొండ ఎస్సై స్రవంతి తెలిపారు. కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు  గ్రామపంచాయతీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు నకిలీ రసీదులు క్రియేట్ చేస్తూ, ఒక వ్యక్తి మణిపురం గోల్డ్ లోన్ లో నుంచి గోల్డ్ విత్ డ్రా చేసుకున్నారు. మరో వ్యక్తి పోలీసు కేసు షూరిటీల విషయంలో ఉపయోగించుటకు ప్రయత్నించారు.ఇద్దరు వ్యక్తులపై పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేయగా దోమకొండ ఎస్సై డి స్రవంతి  ఫోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.