హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం తర్వాత ధాన్యం దిగుబడి రికార్డుస్థాయిలో జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి అవుతుందని, కాళేశ్వరం వల్లే వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ ప్రచారం పటాంపచలు అవుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణమని, రైతుల శ్రమ వల్లే ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో సాధ్యమైందని సీఎం తెలిపారు. అత్యధిక దిగుబడి ఘనత సాధించిన ప్రతి రైతకు అభినందనలు తెలియజేశారు.