19-04-2025 12:49:41 AM
చేగుంట, ఏప్రిల్ 18 :అకాల వర్షానికి చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం తడిసిముద్దయింది. మండలంలోని చందాయిపేట, మక్కరాజ్ పేట్, పోతన్పల్లి, కసాన్ పల్లి, పెద్దశివనూర్ గ్రామాలలో శుక్రవారం సాయంత్రం అకాల వర్షంతో కళ్లాల్లో ఎండబెట్టిన వడ్లు పూర్తిగా తడిసి కొన్ని వర్షానికి కొట్టుకుపోయాయి. దీంతో రైతులు లబోదిమంటున్నారు. ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు స్పందించి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులుకోరుతున్నారు.