జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి స్వీకరించిన ధాన్యంను ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వెలగనూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలు వివరాలను వెంటనే ట్యాబ్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. రవి సీజన్‌లో జొన్న పంట సాగుకు ఇదంతా ప్రాజెక్ట్ నీరు గ్రామానికి దగ్గరగా ఉన్నప్పటికి సాగు, త్రాగునీటికి ఉపయోగంలో లేదని కలెక్టర్‌కు రైతులు వివరించారు. అనంతరం రాజ్యాగం దినోత్సవం సందర్భంగా వెలుగనూరు గ్రామపంచాయతీలో మల్టి పర్పస్ వర్కర్లను కలెక్టర్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాజేందర్, జిల్లా సహకార అధికారి రాంమోహన్, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింహరావు, తహశీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, విండో చైర్మన్ నర్సింహరెడ్డి రైతులు పాల్గొన్నారు.