19-04-2025 01:29:29 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
తలకొండపల్లి,ఎప్రిల్ 18: రైతులు తాము పండించిన వరి,మక్కజొన్న పంటలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రైతులకు సూచించారు.ఆమనగల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నారాయణరెడ్డి,మార్కెట్ కమిటి ఛైర్మన్ యాట గీతనర్సింహ,వైస్ ఛైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి లతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గత ఎన్నికలలో రైతులకిచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అదికారంలోకి వస్తే రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.5 వందలు అదనంగా బోనస్ రూపంలో యిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.
అందుకనుగునంగా కాంగ్రేస్ ప్రభుత్వం అదికారం లోకి రాగానే సన్న రకాల వడ్లకు బోనస్ రూపంలో క్వింటాలుకు అదనంగా రూ 5 వందలు చెల్లించినట్లు గుర్తు చేశారు.రైతులు తమ పంటలను దళారులవద్ద అమ్ముకుని నష్టపపోవద్దని ఎమ్మెల్యే నారాయణరెడ్డి రైతులను కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి డైరెక్టర్ లు అంజయ్యగుప్త,అజీం నాయకులు డోకూరి ప్రభాకర్ రెడ్డి,డేవిడ్,డిగ్రీ కృష్ణ,డాక్టర్ శ్రీనివాస్,నరేష్ నాయక్,రాజునాయక్ లు పాల్గొన్నారు.