calender_icon.png 4 April, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

03-04-2025 05:33:42 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): వరి పండించిన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని విండో అధ్యక్షుడు కయ్యం నరసింహారెడ్డి కోరారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ప్రాథమిక వ్యవసాయం సహకార సంఘ పరిధిలోని గొర్గల్, నర్సింగరావు పల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని తెచ్చి విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందాలని సూచించారు. ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల దుర్గారెడ్డి, మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి, అజ్జం దుర్గయ్య, రామ గౌడ్, సహకార సంఘ సీఈవో సంగమేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.