calender_icon.png 22 October, 2024 | 11:12 AM

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి

16-10-2024 12:52:14 AM

ఎమ్మెల్యేలు వేముల వీరేశం, రామారావు పటేల్

నల్లగొండ/నిర్మల్, ఆక్టోబర్ 15 (విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి, మద్దతు ధర పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్, కొత్తపేట గ్రామాల్లో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజుర గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం రూ.2,320, బీ గ్రేడ్‌కు రూ.2,300 మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. సన్నాల సాగును సర్కార్ ప్రోత్సహిస్తుందని, క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వనుందన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం వెంట డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి ఉన్నారు.