calender_icon.png 26 April, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలి

25-04-2025 01:26:00 AM

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర బృందం

ఖమ్మం, ఏప్రిల్ 24 ( విజయక్రాంతి ):-కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.గురువారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లోనీ తన ఛాంబర్ లో ధాన్యం కొనుగోలు పై రాష్ట్ర బృందంతో, ఐ.కె.పి., ప్యాక్స్, డి.సి.ఎం.ఎస్., మెప్మా, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

అంతకుముందు పౌరసరఫరాల కమీషనర్ కార్యాలయం నుంచి డిప్యూటీ కమీషనర్, జనరల్ మేనేజర్ ప్రొక్యూర్ మెంట్, ఎస్.డబ్ల్యూ.సి జనరల్ మేనేజర్  కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, నేలకొండపల్లి మండలంలోని అరుణాచల రైస్ మిల్లును తనిఖీ చేశారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల డిప్యూటీ కమీషనర్ కొండలు రావు,  జనరల్ మేనేజర్ నాగేశ్వర్ రావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, డిప్యూటీ తహసిల్దార్ (సిఎస్.), ఖమ్మం రూరల్, నేలకొండపల్లి సి.ఎస్. ఆర్.ఐ, తదితరులు పాల్గొన్నారు.