మాజీ ఎమ్మెల్యే చింతల
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో టోకెన్లు ఇవ్వకుండా, కాంటా పెట్టకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. సర్కారు స్పందించి ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకుల బృందం రైతు కల్లాలను సందర్శించినట్లు తెలిపారు.