calender_icon.png 4 April, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం నిబంధనలు పాటించాలి

04-04-2025 12:19:43 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట. ఏప్రిల్ 3 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభు త్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వరి ధాన్యం (సన్న రకం) కొనుగోలుకు సంబంధించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. అయితే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, సన్నాలకు బదులు దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ -సంస్థ ఆధ్వర్యంలో రబీ 2024---- గాను వరి ధాన్యం కొనుగోలు పై గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపుదారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

వరి ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని  సం బంధిత శాఖల అధికారులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అందరూ  సమన్వయంతో   పనిచేసి జిల్లా రైతాంగానికి లబ్ధి చేకూర్చాలని ఆమె సూచించారు. కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో, రూల్స్, గైడ్ లైన్స్ ను అందరూ అమలు చేయాలన్నారు. 

ఇది సీఎం జిల్లా అని, అధికారులంతా సమన్వయంతో  పని చేసి కొనుగోళ్లలో నారాయణ పేట జిల్లాకు  మంచి పేరు తీసుకు రావాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సన్న రకం వడ్లు దొడ్డు రకం వడ్లు వేర్వేరు కౌంటర్లలో కొనుగోలు చేసి, వేరు వేరు రిజిస్టర్ లలో నమోదు చేయాలని తెలిపారు.

ప్రభుత్వం కొన్ని కోట్ల నిధులను కేటాయించి రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు అదనంగా  బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తోందని, ఈ విషయం లో అధికారులు చాలా జాగ్రత్తగా పనిచేయాలని ఆదేశించారు. వెంటనే జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన ఫ్లెక్సీలు, తేమను కోలుచే యంత్రాలు, రిజిస్టర్లు, ముఖ్యంగా ట్యాబ్ లను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఆర్డిఓ రామచందర్ నాయక్, డి సి ఓ శంకరా చారి, డిఎమ్‌ఓ  బాలామణి, స్థానిక మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, దామర గిద్ద విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, అన్ని మండలాల సింగిల్ విండో అధ్యక్షులు, ఐకెపి అధికారులు, ఏవోలు,ఏఈఓ లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.