calender_icon.png 18 April, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారుల వ్యవస్థకు స్వస్తి పలికేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

10-04-2025 10:58:43 PM

తహసీల్దార్ లాలు నాయక్..

పెన్ పహాడ్: రైతులు తమ ధన్యాన్ని దళారుల చేతిలో పడి అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముకోకుండా ప్రభుత్వం మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చి అడ్జకుంటున్నట్లు ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపు మాపడం కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ లాలునాయక్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో పీఏసీఎస్ (చీదేళ్ల) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

ఏఈఓ పరిశీలించిన నిబంధనల ప్రకారమే రైతులకు సంబందించిన ధన్యాన్ని కాంటాలు వేసి అన్ లైన్ లో పొందపర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు, బీఆర్ఎస్ నాయకులు తూముల ఇంద్రసేనా రావు, ఏఓ అనిల్ కుమార్, ఏఈఓ స్వప్న, సీఈఓ సోమ్లా, డైరెక్టర్ గుడెపూరి రవి, దాసరి శ్రీను, ఒగ్గు గోపి, విజయకుమార్, సూర్యనారాయణ, వీరబోయిన లింగయ్య లక్ష్మీకాంతారావు, ఒగ్గు సైదులు తదితరులు ఉన్నారు.