calender_icon.png 27 April, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

26-04-2025 07:07:06 PM

అప్పారావు...

నడిగూడెం: ధాన్యం కొనుగోలు చేసే ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిడి అప్పారావు అన్నారు. శనివారం మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రతి రైతు ఐకెపి  కొనుగోలు కేంద్రానికి ధాన్యం అమ్మితే ప్రతి బస్తాకు 500 రూపాయల బోనస్ అదనంగా ప్రభుత్వం తెలుస్తుందని తెలిపారు. ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సంజీవయ్య, ఎపిఎం బి రామలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి పృథ్వి, CC సాంబయ్య, సంఘబంధం అధ్యక్షురాలు k. భవాని, మంజుల సంఘబంధం కమిటీ సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.