16-04-2025 01:35:16 AM
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
హత్నూర, ఏప్రిల్ 15 :ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కేంద్రాలను ఎమ్మెల్యే మంగళవారం నాడు నస్తీపూర్, కాసాల, దౌల్తాబాద్, రెడ్డి ఖానాపూర్, హత్నూర తదితర గ్రామాలలో ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లు తరలించాలని సూచించారు.
ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కేంద్రాలలో లభిస్తుందన్నారు. ప్రభుత్వం రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఫర్హిన్ షేక్, మండల స్పెషల్ ఆఫీసర్ స్వప్న, ఎంపీడీవో శంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్, పిఎసిఎస్ చైర్మన్లు దుర్గారెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, నాయకులు పుల్లయ్య గారి రామచంద్రారెడ్డి, బైసాని వెంకటేశం గుప్తా,నర్సింహారెడ్డి, డైరెక్టర్ రావులకోరి వెంకటేష్, యూత్ ప్రెసిడెంట్ కిషోర్, పటేల్ శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీకాంత్, దూడి పోచయ్య, అర్జున్, శంకర్, రైతులుపాల్గొన్నారు.