calender_icon.png 6 April, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

05-04-2025 07:47:37 PM

వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ..

కోదాడ: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ, ఆర్డీవో సూర్యనారాయణలు అన్నారు. శనివారం కోదాడ పిఎసిఎస్ పరిధిలోని తమ్మర, తొగర్రాయి గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోవద్దు అని రైతులకు సూచించారు. ప్రభుత్వ పథకాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, సామినేని నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఇర్ల సీతారాం రెడ్డి, అమరనాయిని వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ బుడిగం నరేష్, కమతం వెంకటయ్య,  గుండపునేని ప్రభాకర్, మదన్, రౌతు వెంకటయ్య, సీఈవో మంద వెంకటేశ్వర్లు, సులోచనరావు,  పాల్గొన్నారు.